Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, అవినాష్, పూర్ణ, సుబ్బరాజు
దర్శకుడు: బోయపాటి శ్రీను
నిర్మాతలు: మిర్యాల రవీందర్ రెడ్డి
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ: డిసెంబర్ 02,2021
రేటింగ్: 3.75/5
కథ:
మురళీకృష్ణ (బాలకృష్ణ) అనంతపురం జిల్లాలో ఒక్క రైతు. అలాగే ఫ్యాక్షన్‌నిస్ట్ గా మారిన అనేక మందిని మర్చి మార్పునకు శ్రీకారం చుట్టిన వ్యక్తి. అనేక వైద్యశాలలు, పాఠశాలలు కట్టించి చుటుపక్కల ప్రాంతాలలో ప్రజలకి సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. మురళీకృష్ణ (బాలకృష్ణ) మంచితనం చూసి ఆ జీలా కు కలెక్టర్ గ వచ్చిన శరణ్య (ప్రగ్యా జైస్వాల్) ప్రేమించి పేలాడుతుంది. అక్కడే వరదరాజులు (శ్రీకాంత్) కాపర్ మైనింగ్ చేస్తూ మైనింగ్ మాఫియాని నడుపుతాడు. వరదరాజులు (శ్రీకాంత్)కి చెందిన ఒక గని పేదలకు పెద్దఎత్తున సమస్యలను సృష్టిస్తుంది. మురళీ కృష్ణ వరదరాజులుని అతని మైనింగ్ మాఫియాని అడ్డుకుంటాడు. మైనింగ్ మాఫియాని ఆదుకునేందుకు మురళీ కృష్ణ అతని కుటుంబం ఎదురుకున్న సవాళ్లు, వారిని రక్షించడానికి అఖండ (బాలకృష్ణ అఘోరా) ఎవరు, అతనికి మురళీకృష్ణ (బాలకృష్ణ)కి వున్న సంబంధం ఏమిటి, అఖండ (బాలకృష్ణ అఘోరా) మురళీ కృష్ణ అతని కుటుంబాన్ని మైనింగ్ మాఫియా నుండి ఎలా రక్షించాడు అనేది వెండితెరమీద చూడాల్సిందే
ప్లస్ పాయింట్లు:
బోయపాటి శ్రీను, బాలకృష్ణ వీరిద్దరి కలయిక. బాలయ్యను పవర్‌ఫుల్ అవతారం లో చూసి అభిమానులు చాలా రోజులైంది. బోయపాటి శ్రీను బాలయ్యను మునుపెన్నడూ చూడని అవతారం లో ద్విపాత్రాభినయం లో చుపించాడు .
బాలయ్య తన పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు. అఘోరాగా బాలయ్య ఆధ్బుతంగా నటించాడు. బాలకృష్ణ డైలాగ్ డెలివరీ తో అందరినీ మెప్పించాడు. ఈ సినిమాకి థమన్ అందించిన నేపధ్య సంగీతం చాలాబాగుంది. చిత్ర సన్నివేశాలకు అనుగుణంగా థమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. ప్రగ్యా జైస్వాల్ తనకు వచ్చిన అవకాశాన్ని మంచి నటనతో పూర్తిగా ఉపయోగించుకుంది. శ్రీకాంత్ నెగటివ్ రోల్ అయినా తన పాత్రకు నటనతో న్యాయం చేసాడు. బాలయ్యకు మంచి ప్రతి నాయకుడుగా కనిపించదు. కాలకేయ ప్రభాకర్ క్రూరమైన పోలీసుగా చక్కగా నటించాడు. ఫైట్ల సన్నివేశాలు చాలాబాగా వచ్చాయి. బాలయ్య రెండు పాత్రలను ఆవిష్కరించిన విధానం చాలా అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్లు:
అఖండలో పెద్దగా కథ లేదు. చిత్రంలో తరువాత వచ్చే సన్నివేశాలు మంకు ముందుగానే తెలుస్తాయి. చిత్ర మొదటి భాగం సాగతీసినట్టు ఉంటుంది. బాలయ్య కేవలం గూండాలను చంపుతూనే ఉన్నాడు, కొత్తదనం పెద్దగా కనిపించదు. ద్వితీయ భాగంలో చాలా ఫైట్‌లు ఉంటాయి
సాంకేతిక అంశాలు:
థమన్ తన సంగీతం తో చిత్రానికి ప్రాణం పోశాడు. ఫైట్స్‌ని కొరియోగ్రఫీ చేసిన విధానం చాల బాగుంది. బాలకృష్ణ డైలాగులు పలికించిన విధానం అద్భుతంగా ఉంది. బాలయ్య డ్యాన్సులు, సాహిత్యం, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. బోయపాటి శ్రీను తన దర్శకత్వ ప్రతిభను బలమైన కథను, కథానాయకుడిని ఎనుకోవటంలోనూ వారిని చక్కగా చుపియటంలోనూ విజయం సాధించాడు.
ముగింపు:
అఖండ బాలకృష్ణ అభిమానులకు ఒక చాల రోజులతరువాత ఒక మంచి విందు లాంటిది. బాలయ్య తన అద్భుతమైన నటనతో వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు. ద్వితీయ భాగంలో హింస ఎక్కువైంది కావున క్లాస్ ప్రేక్షకులకి కొంత ఇబ్బంది కలగొచ్చు. అయితే థియేటర్లలో ఒక పెద్ద చిత్రం వచ్చి చాలా కాలం అయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య మాస్ మసాలా అవతారంతో అఖండ మాస్ ప్రేక్షకులకి, బాలయ్య అభిమానులకు ఖచ్చితంగా పండగచేసుకొనే చిత్రం గా మిగులుతుంది.
0 కామెంట్‌లు