Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
సాధారణంగా ఏ ఆధారం లేని వాళ్లు, పనిచేయలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు బిక్షాటన చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో అన్నీ బాగున్నా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్ధేశంతో కూడా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గతంలో దర్జాగా బతికిన కొంతమంది అనుకోని కారణాల వల్ల ఒంటరి వారుగా మారి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసే పరిస్థితి వస్తుంటుంది. ఇలా ఇతరులను వేడుకుంటూ యాచించే వారి గత అనుభవాలు తెలిస్తే ఎంతో భాదేస్తుంది. తాజాగా ఓ యాచకురాలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటం విని స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆమె గురించి తెలుసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని వారణాసికి చెందిన స్వాతి అనే యాచకురాలు ఇంగ్లీష్‌లో అవలీలగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ భారత్‌క చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితికి చేరుకోడంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరకు వారణాసికి చేరుకుంది. గత మూడేళ్ల నుంచి వారణాసిలోనే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది.
అయితే స్వాతి బాగా చదువుకుంది. తను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. అందుకే ఇంగ్లీష్‌లో అంత బాగా మాట్లాడుతోంది. కాగా స్వాతి వీడియోను రికార్డు చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. స్వాతి ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు అయితే.. స్వాతి మాట్లాడే ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోతున్నారు.
సేకరణ - సాక్షి ఈ పేపర్ నుండి
0 కామెంట్‌లు