Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
రాజధానుల అంశంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చామో పేర్కొన్నారు. అమరావతి అంటే ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రమంతా అభివృద్ది చెందాలన్నదే తన తాపత్రయమన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అని, అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఇంకొన్ని జమ చేస్తే.. వైజాగ్.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది గురించి 3 రాజధానులు బిల్లును తీసుకొచ్చామని జగన్ చెప్పారు. బిల్లు వచ్చినప్పటి నుంచి.. అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తే. ఇప్పటికి ఫలాలు అందుతూ ఉండేవని సీఎం చెప్పారు. కానీ ఆ పరిస్థితుల లేనందున 3 రాజధానులపై సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. ఇంతకు ముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. విసృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమన్నారు. చట్ట, న్యాయపరంగా అందరికీ సమాధానాలు చెప్పే విధంగా మళ్లీ బిల్లును తీసుకొస్తామన్నారు. బిల్లులోని సదుద్దేశం అందరికీ వివరిస్తామన్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేస్తామన్నారు.
0 కామెంట్‌లు