Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, వాసంతి
దర్శకుడు: ఆర్‌కే మలినేని
నిర్మాతలు: ఆశాజ్యోతి గోగినేని
సంగీత దర్శకుడు: ప్రజ్వల్ క్రిష్
సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్
ఎడిటర్:
విడుదల తేదీ : నవంబర్ 26,2021
రేటింగ్ : 2.5/5
కథ:
కాలీఫ్లవర్ (సంపూర్నేష్ బాబు) 35 ఏళ్ల వ్యక్తి, అతను తన తాత నిర్దేశించిన కఠినమైన జీవితాన్ని గడుపుతూవుంటాడు. ఒక రోజు అతను ముగ్గురు అమ్మాయిలచే మానభంగం చేయబడతాడు. అప్పటినుండి అతని పరిస్థితి దారుణంగా తయారవుతుంది. మానభంగంతో బాధ చెందిన అతను పోలీస్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరతాడు. అతనిపై మానభంగం చేసిన ముగ్గురు అమ్మాయిలు ఎవరు? వారి వెనుక కథ ఏమిటి? మరి కాలీఫ్లవర్‌కు (సంపూర్నేష్ బాబు) న్యాయం జరిగిందా ? అన్నది తెలియాలంటే సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
ఇది నవించటం కోసం తీసిన సినిమా. ఇందులో సీరియస్‌నెస్ లేదు. సంపూర్నేష్ బాబు తన కాలీఫ్లవర్ పాత్రలో సిన్సియర్‌గా నటించి మంచి వినోదాన్ని అందించాడు. సినిమాలో అతని నటన చాలబాగా నవ్వుకోటానికి బాగుంటుంది. సంపూర్నేష్ బాబు నగ్నంగా వెళ్లి అసెంబ్లీ ముందు నిరసన తెలిపే దృశ్యం బాగా నవ్వు తెపిస్తుంది. పోసాని తన పాత్రలో బాగా నటించి తన సత్తా చాటాడు. మిగతా నటీనటులు కూడా తమ శక్తి మేర నవించటానికి కృషిచేశారు.
మైనస్ పాయింట్లు:
ఈ సినిమా సెటైరికల్ కామెడీ అని చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ సెటైరికల్ కామెడీని అతిగా చూపించడం వల్ల ప్రేక్షకులకు బోరింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా సెటైరికల్ కాన్సెప్ట్ తో తీయటం వలన అలాంటి కామెడీలపై దృష్టి ఉన్న కొందరికే నచ్చుతుంది. మిగిలిన వారికీ చాలా బోరింగ్ గా ఉంటుంది. కథనంలో డైరెక్షన్ లేదు.
సాంకేతిక అంశాలు:
సినిమా నిర్మాణం సాంకేతికంగా పరవాలేదు అనిపించింది. ఎడిటింగ్ అంతగా బాగుండలేదు, సినిమాలో చాలా సన్నివేశాలను ఇంకా బాగా ఎడిట్ చేయవచ్చు అనిపించింది. సంభాషణలు నవ్వు తెపించేలా ఉన్నా సంగీతం మాత్రం కుదిరినట్టు లేదు. దర్శకుడు ఇక్కడ క్లిక్ అవ్వదు.
ముగింపు:
మొత్తం మీద, కాలీఫ్లవర్ ఒక కామెడీ సినిమా, కానీ ఈ సినిమా కామెడీ చేయడంలో విఫలమైంది. సంపూర్నేష్ బాబు కామెడీ గురించి తెలిసిన వారికీ ఈ కాలీఫ్లవర్ కొంత వరకు నచుతుంది కానీ మిగిలిన వారికి అంతగా నచ్చక పోవచ్చును.
1 కామెంట్‌లు
good
రిప్లయితొలగించండి