‘ఎక్స్-ముస్లిం ఆఫ్ కేరళ’ ను స్థాపించారు.. ఈ సంస్థ చేసే పని ఏమిటంటే..! ex muslims of kerala

 

‘ఎక్స్-ముస్లిం ఆఫ్ కేరళ’ అనే గ్రూప్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఈ గ్రూప్ ద్వారా ఇస్లాంను త్యజించిన వారికి సహాయం చేస్తారు. కేరళ రాష్ట్రంలో ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు ‘ఎక్స్-ముస్లిం ఆఫ్ కేరళ’ (కేరళ మాజీ ముస్లిం). ఇస్లాంను విడిచిపెట్టిన వారికి సహాయం చేయడం, మద్దతు ఇవ్వడం ఈ సంస్థ లక్ష్యంగా చెబుతున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీని ‘ఈస్ట్ ముస్లిం డే’గా జరుపుకోవాలని సంస్థ నిర్ణయించింది. జనవరి 9న కొచ్చిలో కలిసిన ఎక్స్-ముస్లిం ఆఫ్ కేరళ సభ్యులు కూడా ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇలాంటి అధికారిక సంస్థను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని ఆర్గనైజేషన్ హెడ్ సి.ఎం.లియాక్కతలి తెలిపారు.


తాము 10 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసాము. సభ్యత్వాలను నమోదు చేస్తున్నాము. ప్రారంభ దశలో భాగంగా.. ఇప్పటికి మేము ఇస్లాంను విడిచిపెట్టిన 300 మంది ముస్లింలను మొదట గుర్తించాము. వారు ఈ సంస్థకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. ఇస్లాంను విడిచిపెట్టిన వారికి నైతిక మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఇస్లాంలోని లోపాలను చూపుతూ ఇస్లాంను విడిచిపెట్టిన చాలా మంది ముస్లింలు ఉన్నారు, కానీ దానిని బహిరంగంగా అంగీకరించడానికి భయపడతారు.

ఇస్లాంను విడిచిపెట్టిన వ్యక్తులు సామాజిక బహిష్కరణతో పాటు మానసిక, శారీరక హింస ఎదుర్కొంటున్నారని లియాక్కతలి తెలిపారు. అందుకే చాలా మంది ప్రజలు తమ మతాన్ని విడిచిపెట్టి తమ గుర్తింపును దాచిపెట్టి జీవించవలసి వస్తోందని అన్నారు. మతాన్ని వీడిన వ్యక్తులకు సొంత కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. ఇస్లాం వీడిన వారికి ఉద్యోగాల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవారికి మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వారి మానవ హక్కులు మరియు గౌరవాన్ని కాపాడటానికి ఈ సంస్థను స్థాపించామని సి.ఎం.లియాక్కతలి అన్నారు. ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించే మత సంప్రదాయాలు లేదా ఆచారాల పేరుతో జరిగే అన్ని అకృత్యాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని కూడా మేము ప్రణాళిక రచిస్తూ ఉన్నామని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు